Saturday 14 January 2012

Apspsc group-2 and group-iv subject Details-2012

ఏపీపీఎస్సీ... అవకాశాలపై విశ్లేషణ..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొన్ని రోజుల వ్యవధిలో దాదాపు నలభై నోటిఫికేషన్లు జారీ చేసింది. వేల సంఖ్యలో ఉద్యోగాలంటూ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఈ నోటిఫికేషన్లను లోతుగా పరిశీలిస్తే.. నిరుద్యోగులకు నిరాశ పరిచే అంశాలే కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కారణం నోటిఫికేషన్లు జారీ అయిన శాఖలు, పోస్టులే! ఒక రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థికి అర్హత ఉండే పోస్టుల సంఖ్య వేళ్లమీద లెక్కించేదిగానే ఉంది. ప్రకటించిన పోస్టులన్నీ ప్రత్యేక అర్హతలు అవసరమైనవే. దీంతో సగటు అభ్యర్థికి అవకాశం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు, అర్హతలు ఏంటి వంటి అంశాలతో విశ్లేషణ..
########################################
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్


మొత్తం ఖాళీలు: 638

పరీక్ష తేదీ: 1-7-2012

ఖాళీలు, అర్హతలు విభాగాల వారీగా:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్స్(సివిల్) ఇన్ ఆర్‌డబ్ల్యుఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సర్వీస్- 536
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్స్(సివిల్/మెకానికల్) ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ - 94
అర్హత: ఈ రెండు కేటగిరీలకు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా ఏఎంఐఈ సర్టిఫికేషన్ కలిగుండాలి. 
సీనియర్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(ఏఈఈ క్యాడర్)- 8
అర్హత: ఆర్కిటెక్చరల్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ లేదా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్‌లో సభ్యత్వమున్న వారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి నేషనల్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణులైన వారు
అర్హులు
వేతన శ్రేణి: 16,150-42,590
ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా. 
రాత పరీక్ష: మొత్తం మూడు పేపర్లలో ఉంటుంది. అవి..

పేపర్-1: జనరల్ స్టడీస్: 150 ప్రశ్నలు, 150 మార్కులు లభించే సమయం 150 నిమిషాలు
పేపర్-2 ఆప్షనల్ సబ్జెక్ట్: సివిల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. 150 ప్రశ్నలు, 150 మార్కులు. సమయం 150 నిమిషాలు

పేపర్-3 ఆప్షనల్ సబ్జెక్ట్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లు ఆప్షనల్స్‌గా ఉంటాయి. అభ్యర్థులు తాము బ్యాచిలర్ ఇంజనీరింగ్‌లో చదివిన బ్రాంచ్ ఆప్షనల్‌నే ఎంచుకోవాలి. ఇందులో కూడా 150 ప్రశ్నలుంటాయి. 150మార్కులు. సమయం 150 నిమిషాలు. 
పేపర్-1 (జనరల్ స్టడీస్): ఇతర పరీక్షల మాదిరిగానే ఈ సిలబస్ ఉంటుంది.

పేపర్-2 (ఆప్షనల్): ఇది కామన్ సిలబస్. దీనిలో రెండు విభాగాలుంటాయి. సివిల్, మెకానికల్ అభ్యర్థులకు స్ట్రెంట్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైబ్రిడ్ మెషినరీ సంబంధిత అంశాలపై ప్రశ్నలుంటాయి.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఎలక్ట్రిక్ సర్క్యుట్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇల్యుమినేషన్, డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, త్రీపేస్ ఇండక్షన్ మోటార్స్, త్రీపేస్ ఆల్టర్నేటర్స్, త్రీ పేస్ సింక్రోనస్ మోటార్స్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ ముఖ్యమైన అంశాలు.

పేపర్-3 (ఆప్షనల్): సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ ఎనాలిసిస్, తదితర కోర్ టాపిక్స్ చదవాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్‌వంటి అంశాలు చదవాలి.

ఎలక్ట్రికల్ అభ్యర్థులు ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ ఎనర్జీ మొదలైన అంశాలు చదవాలి. 
దరఖాస్తు విధానం: ఏప్రిల్ 24, 2012 - మే 23, 2012 
చదవాల్సిన పుస్తకాలు: 
6 నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో కిందివాటిని కూడా చదవాలి.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్-జె.బి.గుప్తా
గేట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-జీనియస్ పబ్లికేషన్స్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ -గాల్గోటియా పబ్లికేషన్స్
మెకానికల్ ఇంజనీరింగ్:
గేట్ మెకానికల్ ఇంజనీరింగ్-జీకే పబ్లికేషన్స్
మెకానికల్ ఇంజనీరింగ్-కుర్మి అండ్ బన్సాల్
సివిల్ ఇంజనీరింగ్:
గేట్-జీకే పబ్లికేషన్స్

ప్రిపరేషన్ ఇలా.. తాము చదివిన బ్రాంచ్‌కు సంబంధించిన బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రామాణిక పుస్తకాల్లో ప్రతి యూనిట్‌కు సంబంధించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. గేట్, ఐఈఎస్ వంటి గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి.

ఏపీపీఎస్సీ ప్రకటించిన మరికొన్ని నోటిఫికేషన్లు
########################################################
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌‌స


 ఖాళీలు 116


అర్హత: మెకానికల్/ కెమికల్ / ఎలక్ట్రికల్/ ఈసీఈ/ సీఎస్‌ఈ/ ఈఈఈ/ మెటలర్జికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రి యల్/ ఆటోమొబైల్/ సెరామిక్స్/ బీఎంఈ/ పెట్రోకెమి కల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లతో బీఈ లేదా బీటెక్. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (ఫిబ్రవరి 29-మార్చి 29)


పరీక్ష తేదీ: మే 6, 2012
#####################################################
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌‌స గ్రేడ్-2 (సాంఘిక సంక్షేమ శాఖ)


 ఖాళీలు: 522


అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ/బీటీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా (మే 24 - జూన్ 24)

పరీక్ష తేదీ: ఆగస్టు 12, 2012

########################################################
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌‌స గ్రేడ్-2 (గిరిజన సంక్షేమ శాఖ)


ఖాళీలు: 289

అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు డీఈడీ / బీఈడీ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా (మే 24 - జూన్ 24)


పరీక్ష తేదీ: ఆగస్టు 12, 2012
######################################################
సీనియర్ స్టెనోగ్రాఫర్స్


మొత్తం ఖాళీలు: 74


పరీక్ష తేదీ: 26-8-2012

విభాగాల వారీగా ఖాళీల వివరాలు - అర్హత: 
ఏపీ సెక్రటేరియెట్ సబ్-ఆర్డినేట్ సర్వీస్- 28, అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమానంతోపాటు ఇంగ్లిష్‌లో టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌లలో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత; తెలుగు టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్, లోయర్ గ్రేడ్‌లలో ఉత్తీర్ణత.

ఏపీ ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లెనరీ ప్రొసీడింగ్స్- 1, అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ/బీఎస్సీ/బీకాం లేదా తత్సమానం. ఇంగ్లిష్‌లో టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌లలో హయ్యర్ గ్రేడ్‌లో ఉత్తీర్ణత.
ఏపీ మినిస్ట్రీరియల్ సర్వీసెస్ - 45, అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ నిర్వహించే టైప్ రైటింగ్-హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్‌లలో ఉత్తీర్ణత లేదా తత్సమానం(ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం).

పే స్కేల్:  10,900 -  31,550
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18- 36 ఏళ్లు

ఎంపిక విధానం: కన్వెన్షనల్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. షార్ట్‌హ్యాండ్, డిక్టేషన్ విభాగాల్లో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి ఆసక్తిని బట్టి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ విభాగంలో.. అభ్యర్థి షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 120 ఇంగ్లిష్ పదాలు రాయాలి. తర్వాత 7 నిమిషాల డిక్టేషన్ ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత షార్ట్‌హ్యాండ్‌ను టైప్‌రైటర్‌పై మాత్రమే ట్రాన్స్‌క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 45 నిమిషాల సమయాన్ని కేటాయించారు.

తెలుగు విభాగంలో.. అభ్యర్థి షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 60 తెలుగు పదాలు రాయాలి. తర్వాత 7 నిమిషాల డిక్టేషన్ ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత షార్ట్‌హ్యాండ్‌ను టైప్‌రైటర్‌పై మాత్రమే ట్రాన్స్‌క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 45 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు టైప్‌రైటర్లను సొంతంగా సమకూర్చుకోవాలి.

కెరీర్‌గ్రాఫ్: సీనియర్ స్టెనోగ్రాఫర్ తర్వాత ఆయా డిపార్ట్‌మెంట్‌లను బట్టి.. అర్హత, అనుభవం, ఖాళీ, నిబంధనలమేరకు సీనియర్ అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్, సీనియర్ స్పెషల్ కేటగిరీ స్టెనో, సూపరిండెంట్, సెక్రటరీగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూన్ 7, 2012 - జూలై 7, 2012 


ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 5, 201
###############################################
అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్


మొత్తం ఖాళీలు: 24


పరీక్ష తేదీ: 17-6-2012


వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు
అర్హత: మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్, ప్యూర్ ఎకనామిక్స్, అప్లయిడ్ ఎకనామిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఎకనోమెట్రిక్స్, కంప్యూటర్ సైన్స్. లలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. 
రాత పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1 జనరల్ స్టడీస్; పేపర్-2 అభ్యర్థి ఎంచుకన్న ఆప్షనల్ సబ్జెక్ట్. 

పేపర్-1 జనరల్ స్టడీస్: 150 ప్రశ్నలకు 150 మార్కులు 150 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.
పేపర్-2 (ఆప్షనల్): మ్యాథ్‌‌స, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్‌లలో ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. 150 ప్రశ్నలు. 300 మార్కులు. సమయం 150 నిమిషాలు.

పేపర్-2: 

మ్యాథమెటిక్స్రిఫరెన్స్ బుక్స్:

 Real Analysis higher education -Russel Gordon/ Pears Education Publication Book By Krishnan; Complex Analysis By Choudary. B; Abstract Algebra By W.Gamlin; Differential Equation By B.Rai / Engineering Mathamatics By Prentice; Lenear Algebra By N.Goyal; Modern Algebra By J.N.Sharma/Vasista; 3D-Cordinate Geometry By Soujanya/ B.Hari Krishna;Probabilty & Stastics By CM Gomsted/ By Abc book; Interface of India By Prem Shanker; Sampling of Population By Asian Book Publishers

ఎకనామిక్స్:రిఫరెన్స్ బుక్స్:


 Macro Economics: G.S.Gupta; Economics: Samuelson; Advan-ced Economic Theory: H.L.Ahuja; Moneta-ry Economics: M.C.Vaish; International Economics: Joseph Cherunilan; Internation-al Economics: M.L.Jhingan; Economics of Development and Planning: M.L. Jhingan; Indian Economy: Misra & Puri,Indian Eco-nomy: Dutt & Sundaram; 50 Years of A.P. Economy: Hanumantha Rao, CESS, Hyd.

కంప్యూటర్ సైన్స్ రిఫరెన్స్ బుక్స్: Computer Organization & Architecture - Hamacher/ William Stallings/ Morris Mano; Progra-mming- Kanithkar; Data Structure -Allen-weiss; Algorithms- Sahni; Compiler Design - Ravi Sethi; Operating System - Tannen Baum/ William Stalling/ Galvin; Data Base - Korth/Ragu Rama Krishna/ C.J. Date; Software Engineering- Pressman; Computer Networks - Tannen Baum

జాబ్ ప్రొఫైల్: వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక డేటా సేకరణ; వ్యవసాయం, వర్షపాతం, పరిశ్రమలు తదితర అంశాలకు సంబంధించి గణాంకాల రూపకల్పన; రాష్ట్ర, జాతీయ ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన సర్వేల నిర్వహణ వంటి విధులు చేపట్టాలి. కెరీర్ గ్రాఫ్: సీనియారిటీ, నిబంధనల ప్రకారం డిప్యూటీ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్, డెరైక్టర్‌గా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 12-ఏప్రిల్ 12, 2012. 


ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2012

డిగ్రీ లెక్చరర్‌‌సకు.. ఇంటర్వ్యూలు కూడా..
#####################################################
ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్


మొత్తం ఖాళీలు: 35 


పరీక్ష తేదీ: 4-3-2012

అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో ఉత్తీర్ణత. 
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18 - 36 ఏళ్లు
పే స్కేల్:14, 860 -  39, 540
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ 
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు అవి..
పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి. సమయం 150 నిమిషాలు.
పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్): 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులు. లభించే సమయం 150 నిమిషాలు.

సిలబస్ తీరు తెన్నులు: 
పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 
పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్): బయాలజీ, జువాలజీ, ఫిషికల్చర్ సంబంధ ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ క్రమంలో టాక్సానమీ, కార్డేట్స్, నాన్ కార్డేట్స్ వాటి ధర్మాలు; ఫిషికల్చర్, ప్రాన్ కల్చర్ విషయంలో ప్రోటోజువా, ఆర్థ్రోపొడా, ఫైలం కార్డేటా, జనరల్ మార్ఫాలజీ, చేపల వృద్ధి, చేపల ఆహార అలవాట్లు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ నిర్మాణం-పనితీరు, పునరుత్పత్తి వ్యవస్థ, బ్రీడింగ్ మెథడ్స్, వనరులు, మెరైన్ బయాలజీ, ఆక్వాకల్చర్, చేపలు, రొయ్యల్లో కలిగే వ్యాధులు, ఫిషరీస్ ఆర్థికంగా వాటి ప్రాధాన్యం వంటి అంశాలు అధ్యయనం చేయాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు: జనవరి 20 - ఫిబ్రవరి 18, 2012 


ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2012

జాబ్ ప్రొఫైల్:
చేపల దాణా ఉత్పత్తులు - నిల్వ, చేపల పెంపకంలో వృద్ధికి చర్యలు, మత్స్య కారులకు లెసైన్స్‌ల మంజూరు వంటి కార్యకలాపాలు నిర్వహణ, పర్యవేక్షణ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
##########################################
లెక్చరర్‌‌స ఇన్ డిగ్రీ కాలేజెస్


మొత్తం ఖాళీలు: 656


పరీక్ష తేదీ: 6-5-2012

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
ఇంగ్లిష్: 71; తెలుగు: 27; హిందీ: 17; ఉర్దూ: 9; సంస్కృతం: 3; ఒరియా: 1; అరబిక్: 1; కామర్స్: 60; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: 7; ఎకనామిక్స్: 28; హిస్టరీ: 19; పొలిటికల్ సైన్స్: 27; మ్యాథమెటిక్స్: 24; ఫిజిక్స్: 43; కెమిస్ట్రీ: 21; బోటనీ: 33; జువాలజీ: 23; స్టాటిస్టిక్స్: 5; బయో కెమిస్ట్రీ: 3; బయో టెక్నాలజీ: 10; మైక్రో బయాలజీ: 16; కంప్యూటర్ అప్లికేషన్స్: 73; కంప్యూటర్ సైన్స్: 133; జియాలజీ: 2.
పే స్కేల్: 8000- 13,500
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు

అర్హత: 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు 50 శాతం) పీజీ ఉత్తీర్ణతతోపాటు యూజీసీ-నెట్/సీఎస్‌ఐఆర్ నెట్/ఏపీపీఎస్సీ నిర్వహించిన స్లెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష,ఇంటర్వ్యూల ఆధారంగా

రాత పరీక్ష: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్-1 జనరల్ స్టడీస్: 150 ప్రశ్నలకు 150 మార్కులు. సమయం 150 నిమిషాలు. 
పేపర్-2 సంబంధిత సబ్జెక్ట్: ఇది అభ్యర్థులు తమ పీజీ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టు. ఇందులో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 300. 

సిలబస్ తీరుతెన్నులు: 
పేపర్-1 (జనరల్ స్టడీస్) 
పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్): అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో జరిగే ఈ పేపర్‌లో ప్రశ్నలన్నీ పీజీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి సదరు సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక భావనలు, తాజా మార్పుల వరకు అధ్యయనం చేయాలి. ఇంటర్ నుంచి పీజీ వరకు సంబంధిత పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. 
మౌఖిక పరీక్ష: 50 మార్కులు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.

కెరీర్... పదోన్నతులు: 
తొలుత డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా చేరితే ఆ తర్వాత సీనియారిటీ, ఖాళీలు, రిజర్వేషన్ ఆధారంగా అసోసియేట్ ప్రొఫెసర్.. ఆ తర్వాత రీడర్, ప్రిన్సిపాల్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 29 - మార్చి 29, 2012


ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 27, 2012
#################################################
మేనేజర్ (ఇంజనీరింగ్)- హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ స్యువెరేజ్ బోర్డ్


మొత్తం ఖాళీలు: 80


పరీక్ష తేదీ: 29-7-2012
సివిల్ ఇంజనీరింగ్- 58; మెకానికల్ ఇంజనీరింగ్-6; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-6; ఈసీఈ -5; సీఎస్/ఐటీ -5.

పేస్కేల్: 16,150 -  42,590
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18 -36 ఏళ్లు
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్
ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా
రాత పరీక్ష విధానం: రెండు పేపర్లు.

పేపర్-1: జనరల్ స్టడీస్. 150 ప్రశ్నలు(150 మార్కులు). లభించే సమయం 150 నిమిషాలు.
పేపర్-2: సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు (300 మార్కులు). సమయం 150 నిమిషాలు.

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1 జనరల్ స్టడీస్: 
పేపర్-2: అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో చదివిన బ్రాంచ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్‌తోపాటు అప్లికేషన్స్‌పై పట్టు సాధించాలి. ఏఈఈ, గేట్, ఐఈఎస్ తదితర పరీక్షలకు లభించే మెటీరియల్‌తో కూడా సన్నద్ధం కావచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తు: మే 29, - జూన్ 29, 2012 వరకు


ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 27, 2012

జాబ్ ప్రొఫైల్:
జంట నగరాలు (హైదరాబాద్, సికింద్రాబాద్) పరిధిలో తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యంకి సంబంధించి సాంకేతిక విధులు (డ్రెయిన్లు, వాటర్ పైప్‌లైన్ల నిర్మాణ పర్యవేక్షణ; పంపింగ్ యంత్రాల నిర్వహణ; వంటి విధులు) నిర్వర్తించాల్సి ఉంటుంది.
########################################################
సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఏపీ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీస్


మొత్తం ఖాళీలు: 319


పరీక్ష తేదీ: 8-8-2012


అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. దీంతోపాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గుర్తింపు పొంది ఉండాలి.
పే స్కేల్: 20,680 - 46,960
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18- 36 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా (ఇంటర్వ్యూ ఉండదు)

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు. 
పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు. 150 మార్కులు. లభించే సమయం 150 నిమిషాలు.
పేపర్-2 మెడికల్ సైన్స్ అండ్ జనరల్ మెడిసిన్: 150 ప్రశ్నలు(300 మార్కులు). సమయం 150 నిమిషాలు.

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1 (జనరల్ స్టడీస్): 
పేపర్-2 సబ్జెక్ట్ (మెడికల్ సైన్స్ అండ్ జనరల్ మెడిసిన్): మెడికల్ సైన్స్‌కు సంబంధించి మానవ శరీర నిర్మాణ వ్యవస్థ; శరీర ధర్మ శాస్త్రం; వివిధ అవయవాల పనితీరు, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ తదితర ఆరోగ్య సంబంధ అన్ని విషయాలపై అవగాహన పొందాలి. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి పలు వ్యాధులు, వాటికి చికిత్స, ఔషధాల వినియోగం-వాటి వల్ల ఏర్పడే ప్రతిచర్యలు, నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ విధానం తదితర అంశాలపై దృష్టి సారించాలి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు తేదీలు: మే 18 - జూన్ 18, 2012
ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 16, 2012

జాబ్ ప్రొఫైల్:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాలు, వ్యాపార సంస్థల్లోని ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన సంస్థ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా చేరిన వారు ఈ సంస్థ పరిధిలోని వైద్య కేంద్రాల్లో వైద్యులుగా సేవలందించాల్సి ఉంటుంది. 
##############################################
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్


మొత్తం ఖాళీలు: 24


పరీక్ష తేదీ: 30-9-2012
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పే స్కేల్: 14,860 -  39,540
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు, ఎంపిక: రాత పరీక్ష ద్వారా(ఇంటర్వ్యూ ఉండదు)
రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లు. అవి..

పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 150 ప్రశ్నలు. 150 మార్కులు. సమయం 150 నిమిషాలు.

పేపర్-2 సబ్జెక్ట్ (కంపల్సరీ పేపర్): ఇందులో మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 300 మార్కులు. సమయం 150 నిమిషాలు.

సిలబస్ తీరు తెన్నులు: 
పేపర్-1:జనరల్ స్టడీస్. 

పేపర్-2 సబ్జెక్ట్ (కంపల్సరీ): ఇందులో సెక్షన్-1లో భారతదేశ చరిత్రకు సంబంధించి అంశాలను చేర్చారు. ఈ క్రమంలో సింధు, వేదకాలం నాగరికతలు, జైన, బౌద్ధ, ఇతర మతాలు, వర్ణ వ్యవస్థ, మగధ సామ్రాజ్య విస్తరణ, గాంధార, మధుర, ఇతర శిల్ప కళలు, మహాయానం విస్తరణ, భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం, మత, భక్తి ఉద్యమాలు, కళలు, సాహిత్యం, నాటి నిర్మాణాలు, విజయనగర సామ్రాజ్యం-కళలు, సంస్కృతి, పరిపాలన,పతనం, మొఘలులు, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, భారత జాతీయోద్యమంలో వివిధ దశలు, సంఘటనలపై డిగ్రీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సెక్షన్-2లో ఆంధ్రప్రదేశ్ చరిత్రపై అంశాలను సిలబస్‌గా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, క్రీ.శ 1000 నుంచి 1565 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర, అసఫ్‌జాహి సుల్తానులు, తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం, హైదరాబాద్ సంస్థానాలపై ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-3లో భాగంగా భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ, 73, 74 రాజ్యాంగ సవరణలు, సెక్షన్-4లో భారత ప్రణాళిక వ్యవస్థ, పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వ రాబడులు-వ్యయాలు; సెక్షన్-5లో స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో భూ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు, స్త్రీ సాధికారికతలపై; సెక్షన్-6లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత స్థితిగతులు, బలాలు-బలహీనతలు వంటి అంశాలుంటాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేదీలు: జూలై 30- ఆగస్టు 30, 2012


ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 28, 2012
############################################################
టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీస్ ఇన్ ఏపీ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సబ్ సర్వీస్
మొత్తం ఖాళీలు: 194
పరీక్ష తేదీ: 13-5-2012
పే స్కేల్:  9460-  27,700

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లేదా శానిటరీ ఇంజనీరింగ్‌లో లెసైన్స్ పొందాలి లేదా సర్టిఫికెట్ ఇన్ ఆర్కిటెక్చర్ లేదా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్ అండ్ అసిస్టెంట్‌షిప్ ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ ఉత్తీర్ణతతోపాటు పట్టణ ప్రణాళిక విభాగంలో ఏడాది పని అనుభవం లేదా ఐటీఐ లేదా డ్రాఫ్ట్‌మెన్స్ ఇన్ సివిల్‌కోర్స్ ఉత్తీర్ణతతోపాటు పట్టణ ప్రణాళిక విభాగంలో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు. 

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి 1. జనరల్ స్టడీస్ (పదో తరగతి స్థాయి); 2. సబ్జెక్ట్ (ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్టాండర్డ్). ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు.

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1: జనరల్ స్టడీస్
పేపర్-2: ఈ పేపర్‌కు సంబంధించి లెటరింగ్, నంబరింగ్, ఆర్డినరీ స్కేల్ నిర్మాణం, డ్రాయింగ్ ప్లాన్, సర్ఫేసెస్ అండ్ సాలిడ్స్, లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, ప్రదేశాలను కొలవడం మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ అకడెమిక్ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 7- ఏప్రిల్ 7, 2012.


ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2012
#################################################

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1(సూపర్ వైజర్) - ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ

మొత్తం ఖాళీలు: 314


పరీక్ష తేదీ: 29-4-2012


అర్హత: హోం సైన్స్ లేదా సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18 - 36 ఏళ్లు
పే స్కేల్: 12, 560 - *35, 800
ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 
రాత పరీక్ష: రెండు పేపర్లుగా ఈ పరీక్ష ఉంటుంది. అవి..

పేపర్-1 : జనరల్ స్టడీస్. 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉంటుంది. లభించే సమయం 150 నిమిషాలు.
పేపర్-2 సబ్జెక్ట్ పేపర్ (హోం సైన్స్ లేదా సోషల్ వర్క్): అభ్యర్థులు తమ డిగ్రీ నేపథ్యాన్ని అనుసరించి ఈ రెండు సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. 

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1 (జనరల్ స్టడీస్): 
పేపర్-2 హోం సైన్స్: ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ పరిధిలోని పోషకాహార పదార్థాలు, దేహ నిర్మాణ పదార్థాలు, శక్తి పదార్థాలు, పాలు, పాల ఉత్పత్తులు తదితర అంశాలపై పట్టు సాధించాలి. పోషకాహార లోపం కారణంగా కలిగే వ్యాధులు వాటి నివారణ మార్గాలు వంటివాటిపైనా దృష్టి సారించాలి. చైల్డ్ డెవలప్‌మెంట్ విషయంలో.. పిల్లల్లో పెరుగుదల కారకాలు, ఇమ్యునైజేషన్, చిన్నారులకు భౌతిక, మానసిక అవసరాలకు తోడ్పడే అంశాలపై అవగాహన పొందాలి. ఆహారం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ విధానాల విషయంలో ప్రభుత్వ ప్రణాళికలపై అవగాహన కూడా ఉండాలి. 

సోషల్ వర్క్: ప్రాథమిక భావన, దేశంలో, ప్రపంచంలో సోషల్ వర్క్ సంస్కరణలు, సోషల్ వర్క్‌లోని పద్ధతులు, సోషల్ వర్క్ రంగాలు, కుటుంబ, చిన్నారుల సంక్షేమం, స్వచ్ఛంద సంస్థలు వాటి ప్రాధాన్యం వంటి సామాజిక సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 6-మార్చి 6, 2012 .


ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 3, 2012

జాబ్ ప్రొఫైల్: మహిళాభివృద్ధి-శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీం, కిశోర్ శక్తి యోజన, ఎన్‌పీఏజీ వంటి పథకాల పనితీరును; ఈ శాఖ పరిధిలోని స్టేట్ హోమ్స్, పునరావాస కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, శిశు విహార్ల పనితీరును పర్యవేక్షించాల్సి ఉంటుంది.
############################################################
గ్రూప్-4 సర్వీసెస్


మొత్తం ఖాళీలు: 1335



పరీక్ష తేదీ: 8-8-2012

జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ - 217; జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ - 114; జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సీసీఎల్‌ఏ - 952; జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్‌మెంట్ - 43; జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ - 3; జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ -6.
అర్హత: ఆయా పోస్టుల ప్రకారం అర్హత ప్రమాణాలు..
####################################################################
జూనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్


మొత్తం ఖాళీలు: 217
: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహించే ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ కోర్సుల్లో ఏదో ఒక దానిలో ఉత్తీర్ణత (లేదా) బీసీఏ, బీఎస్సీ/బీకాం/ బీఏ (కంప్యూటర్స్) లేదా బీటెక్/బీఈ(కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ)లో ఉత్తీర్ణత.

మిగతా అయిదు శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు
పే స్కేల్: 8,440 -  24,950
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. 
రాత పరీక్ష: రెండు పేపర్లుగా ఉంటుంది. అవి..
పేపర్-1: జనరల్ స్టడీస్. 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. లభించే సమయం 150 నిమిషాలు. 
పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్: ఇందులో కూడా 150 ప్రశ్నలు. మార్కులు 150. సమయం 150 నిమిషాలు

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1 జనరల్ స్టడీస్: 
పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్: 
వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌కు సంబంధించి సెంటెన్స్ రీ ఎరేంజ్‌మెంట్, కాంప్రెహెన్షన్ తదితర ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు గణితంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా న్యూమరికల్, అర్థమెటిక్ ప్రశ్నలుంటాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మే 24, - జూన్ 24, 2012


ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 22, 2012

జాబ్ ప్రొఫైల్: జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ హోదాల్లో తాజా ప్రకటనలో పేర్కొన్న శాఖల్లో చేరిన వారు ప్రధానంగా ఆయా శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో రికార్డుల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. 
#############################################################

ఏపీ టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్‌లో 

అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్‌మెన్‌‌స, సర్వేయర్‌‌స


మొత్తం ఖాళీలు: 81

పరీక్ష తేదీ: 12-5-2012

పే స్కేల్: * 9460- * 27700
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు. 
ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా

రాత పరీక్ష: రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్-1 జనరల్ స్టడీస్: ఇందులో మొత్తం 150 ప్రశ్నలకు 150మార్కులు. సమయం 150 నిమిషాలు. 
పేపర్-2 (సబ్జెక్ట్): 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి. లభించే సమయం 150 నిమిషాలు.

సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1: జనరల్ స్టడీస్ 
పేపర్-2: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది. లెటరింగ్, నంబరింగ్, ఆర్డినరీ స్కేల్ నిర్మాణం, డ్రాయింగ్ ప్లాన్, సర్ఫేసెస్ అండ్ సాలిడ్స్, లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, ప్రదేశాలను కొలవడం మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 3, 2012 నుంచి ఏప్రిల్ 5, 2012

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఏప్రిల్ 3, 2012
############################################

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌‌స- ఏపీ ఫారెస్ట్ సర్వీస్

మొత్తం ఖాళీలు: 90


పరీక్ష తేదీ: 3-6-2012


అర్హత: అగ్రికల్చర్/బోటనీ/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్)/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ/జియాలజీ/ హార్టికల్చర్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/వెటర్నరీ సైన్స్/జువాలజీ సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-30 ఏళ్లు.
పే స్కేల్: 15,280-*40,510
ఎంపిక: రాతపరీక్ష, వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా
రాత పరీక్ష: మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. అవి...
పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 150 ప్రశ్నలకు 150 మార్కులు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సమయం 150 నిమిషాలు.

పేపర్-2: జనరల్ ఇంగ్లిష్ ఇందులో 100 ప్రశ్నలు. మొత్తం మార్కులు 100; పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. 
పేపర్ -3: మ్యాథమెటిక్స్. 150 ప్రశ్నలు. 150 మార్కులు. 150 నిమిషాలు. 
పేపర్-4 (ఆప్షనల్ సబ్జెక్ట్): అభ్యర్థి ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుపై 200 ప్రశ్నలుంటాయి. వీటిని మూడు గంటల వ్యవధిలో రాయాలి. మొత్తం మార్కులు 200. 

ప్రిపరేషన్ ప్లాన్: 
పేపర్-1:జనరల్ స్టడీస్ 
పేపర్-2: పదో తరగతి స్థాయిలో గ్రామర్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్సెస్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లతోపాటు గ్రామర్‌పై పట్టు సాధించాలి. 

పేపర్-3: పదోతరగతి స్థాయిలో జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
పేపర్-4(ఆప్షనల్): లైఫ్ సెన్సైస్ అభ్యర్థులు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాస్తే అత్యధిక మార్కులు పొందొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు వారి సబ్జెక్టులనే ఎంచుకుంటే మంచిది. ఈ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కుల కోసం ఎంసెట్/ఏఐఈఈఈ / ఐఐటీజేఈఈ మెటీరియల్‌ను, పీజీ ఎంట్రెన్స్‌ల మెటీరియల్‌ను చదివాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో 65 శాతం, డిగ్రీ స్థాయిలో 35 శాతం ప్రశ్నలుండొచ్చు. 

కెరీర్: ఎఫ్‌ఆర్‌ఓగా చేరినవారు సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఏసీఎఫ్, డీసీఎఫ్, కన్సర్వేటర్‌గా పదోన్నతులు పొందుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 3 - మే 3, 2012


ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012
##########################################################
డిప్యూటీ సర్వేయర్


మొత్తం ఖాళీలు: 432

పరీక్ష తేదీ: 22-4-2012

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు
సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్‌గా రెండేళ్ల వ్యవధిలో ఉండే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) కోర్సులో ఉత్తీర్ణత (లేదా)
ఐటీఐ (సివిల్ డ్రాఫ్ట్స్‌మన్) ఉత్తీర్ణత (లేదా)
ఒకేషనల్ ఇంటర్మీడియెట్‌లో కన్స్‌ట్రక్షన్ టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు 4నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్.
పే స్కేల్: * 9,460 - * 27,700

వయోపరిమితి: జూలై 1, 2011 నాటికి 18-38 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా. 

రాత పరీక్ష : రెండు పేపర్లు. అవి.. పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 మార్కులు. 150 ప్రశ్నలు. 150 నిమిషాలు.
పేపర్-2 (డ్రాఫ్ట్స్‌మన్ సివిల్): 150 ప్రశ్నలు (150 మార్కులు). లభించే సమయం 150 నిమిషాలు. 
సిలబస్ తీరుతెన్నులు:
పేపర్-1(జనరల్ స్టడీస్): 

పేపర్-2 (డ్రాఫ్ట్స్‌మన్ సివిల్): సర్వే, డ్రాఫ్టింగ్‌కు సంబంధించిన అంశాలపైనే ప్రశ్నలుంటాయి. లెటర్-నంబరింగ్ ప్రాధాన్యత, జామెట్రిక్ ఫిగర్స్ రూపకల్పన, ఆర్డినరీ స్కేల్ నిర్మాణం, ఆయా నిర్మాణాల ప్లాన్‌ల రూపకల్పనకు సంబంధించిన నియమాలు, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, బిల్డింగ్ డ్రాయింగ్స్, గుర్తులు, చిహ్నాల రూపకల్పన నియమాలపై దృష్టి సారించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు: ఫిబ్రవరి 15- మార్చి 15, 2012

ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 13, 2012
జాబ్ ప్రొఫైల్: మండల, పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ భూముల సర్వే నిర్వహణ, రికార్డుల క్రమబద్ధీకరణ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
########################################################
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్

మొత్తం ఖాళీలు: 1926
పరీక్ష తేదీ: 1-7-2012

నీటిపారుదల, ఆయకట్టు శాఖ: సివిల్ -1170, మెకానికల్ -130; ఆర్ అండ్ బీలో ఎలక్ట్రికల్ - 24, సివిల్ - 374; పంచాయతీరాజ్‌లో (సివిల్/ మెకానికల్) 214; గిరిజన సంక్షేమ శాఖ(సివిల్ / మెకానికల్)14 ఖాళీలు.

పేస్కేల్: *16,150 - *42,590
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ . 
ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా
రాత పరీక్ష విధానం: మూడు పేపర్లు. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2, 3 లు ఆప్షనల్ సబ్జెక్ట్‌లు. 
పేపర్-1: జనరల్ స్టడీస్. 150 మార్కులు. 150 ప్రశ్నలు. 150 నిమిషాలు. 

పేపర్-2(ఆప్షనల్, సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్): 150 ప్రశ్నలు. 150 మార్కులు. సమయం 150 నిమిషాలు. 
పేపర్-3 (ఆప్షనల్, సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్): 150 ప్రశ్నలు. 150 మార్కులు. సమయం 150 నిమిషాలు. 
బీఈ/బీటెక్‌లో సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. 

సిలబస్ తీరు తెన్నులు:
పేపర్-1: జనరల్ స్టడీస్.
పేపర్-2: సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు వేరుగా ఉంటుంది. సివిల్, మెకానికల్ అభ్యర్థులు స్ట్రెంగ్త్స్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌పై బాగా దృష్టి సారించాలి. మౌలిక భావనలపై పట్టు బిగించాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌పై పట్టు సాధించాలి.

పేపర్-3: సివిల్ అభ్యర్థులు బిల్డింగ్ మెటీరియుల్స్‌లో ప్రాపర్టీస్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియుల్స్ స్ట్రక్చరల్ అనాలసిస్‌లో కాలమ్స్, బీమ్స్, వుల్టీ బిల్డింగ్స్; ఆర్.సి.సి.లో సిమెంట్, శాండ్, వాటర్, గ్రావెల్, మిక్సింగ్‌ల నిష్పత్తి, ఐఎస్ కోడ్స్‌పై అవగాహన ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు థర్మోడైనమిక్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియుల్ ఇంజనీరింగ్ అంశాలపై పట్టు సాధించాలి. ఎలక్ట్రికల్ అభ్యర్థులు పవర్ సిస్టమ్స్, యుుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతర ఇంజనీరింగ్ సబ్జెక్టుల కోసం సంబంధిత బ్రాంచ్‌లలో గేట్,ఐఈఎస్ కోసం జి.కె.; ఉప్‌కార్; మేడ్ ఈజీ, జీనియుస్‌లు ప్రచురించిన ఆబ్జెక్టివ్ బుక్స్ చదవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు: ఏప్రిల్ 24- మే 23, 2012. 


ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 21, 2012






Read More

Sunday 8 January 2012

Read More

Dsc notificatons-2012

UP COMING DSC JOBS NOTIFICATION  -2012
The Andhra Educational Board Is Going To Announce The Andhra DSC Notification Soon.
Read More

Thursday 5 January 2012

ANDHRA PRADESH STATE ROAD TRANSPORT CORPORATION RECRUITMENT -2012

ANDHRA PRADESH STATE ROAD TRANSPORT CORPORATION RECRUITMENT (APSRTC)-2012
1. TRAFFIC SUPERVISOR  TRAINEE-(TST) -104


2. MECHANICAL SUPERVISOR TRAINEE (MST)-138




MORE DETAILS:   CLICK HERE
Read More

SBI(STATE BANK OF INDIA) CLERKS-2012

RECRUITMENT OF CLERKS IN SBI
SPECIAL RECRUITMENT DRIVE FOR SC/ST/OBC CATEGORY
REGULAR RECRUITMENT FOR POSTING AT NORTH EASTERN CIRCLE
DATE OF WRITTEN EXAMINATION : 18.03.2012 (SUNDAY)ON-LINE REGISTRATION WILL START FROM : 28.12.2011LAST DATE FOR REGISTRATION OF ONLINE APPLICATION : 20.01.2012
                                                      PAYMENT OF FEES : 30.12.2011 TO 25.01.2012
Read More

Tuesday 3 January 2012

SIMBU'S LOVE ANTHEM

Read More

Wednesday 28 December 2011

Group notifications-2012

APSPSC








Read More
Powered by Blogger.

Popular Posts

Followers